Archana Jois: టాలీవుడ్ స్టార్స్ పై రాఖీ తల్లి అభిప్రాయమిదే!

అర్చన జోయిస్ అంటే తెలుగు ప్రేక్షకులు సులువుగా గుర్తు పట్టలేరు కానీ కేజీఎఫ్ సినిమాలో రాఖీ భాయ్ తల్లి పాత్రలో అద్భుతంగా నటించిన నటి అంటే మాత్రం ప్రేక్షకులు సులువుగా గుర్తు పట్టగలరు. కన్నడ సీరియళ్లలో నటించడం ద్వారా పాపులర్ అయిన అర్చన జోయిస్ తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాన్న శ్రీనివాసన్ బేకరీ బిజినెస్ చేశారని అమ్మ వీణ, చెల్లి వైష్ణవి అని ఆమె తెలిపారు.

Click Here To Watch NOW

తాను కోలార్ లో పుట్టానని అర్చన జోయిస్ అన్నారు. ఏపీలోని పుంగనూరులో చాలా సంవత్సరాల క్రితం బేకరీ బిజినెస్ చేశామని ఆమె తెలిపారు. కేజీఎఫ్ తన తొలి సినిమా అని ఆమె పేర్కొన్నారు. మహాదేవి సీరియల్ ను చూసి కేజీఎఫ్ లో ఛాన్స్ ఇచ్చారని ఆ సీరియల్ లో తాను త్రిపుర సుందరి అనే పాత్రలో నటించానని ఆమె వెల్లడించారు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత తన సోషల్ మీడియా ఫాలోవర్లు ఊహించని స్థాయిలో పెరిగారని అర్చన జోయిస్ అన్నారు.

యశ్ ఈవెంట్లలో మా అమ్మ అర్చన అని చెబుతుంటే ఎమోషనల్ అయ్యానని ఆమె చెప్పారు. ప్రభాస్ సినిమా సక్సెస్ తర్వాత టీమ్ మెంబర్స్ కు కాల్ చేసి ప్రశంసించారని ఆమె అన్నారు. నాన్నగారికి పవన్ స్టైల్ అంటే ఇష్టమని మాకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఇష్టమని ఆమె పేర్కొన్నారు. బొమ్మరిల్లు తన ఫేవరెట్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ స్టైల్ మేనరిజమ్స్ ఇష్టమని చిరంజీవి డ్యాన్స్ ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు.

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో పవర్ ఫుల్ గా కనిపించారని చరణ్ అమేజింగ్ అని ఆమె వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ లో క్యూట్ నెస్ ఉంటుందని ఆయన చాలా క్యూట్ గా ఉంటారని అర్చన తెలిపారు. నాని యాక్టింగ్ అంటే ఇష్టమని నాగ్ పర్ఫామెన్స్ అంటే ఇష్టమని ఆమె పేర్కొన్నారు. వెంకటేష్ లో కామెడీ టైమింగ్ ఇష్టమని అర్చన వెల్లడించారు. అర్చన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus