పుట్టినరోజు వేడుక అనేది ప్రత్యేకంగా ఉండాలి అని భావించని వారుంటారా. ఆరోజు చాలా వరకు పనుల్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆ రోజంతా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు. అందుకు సామాన్యులు అయితే ఇల్లు లేదా రెస్టారెంట్ వేదికగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. సెలబ్రెటీలు అయితే స్టార్ హోటల్స్, రిసార్ట్స్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటారు. అయితే ఓ నటి మాత్రం ఇందుకు భిన్నంగా తన పుట్టిన రోజు వేడుకను స్మశానంలో సెలబ్రేట్ చేసుకుంది.
ఆ నటి మరెవరో కాదు ఆర్యా ఘారే. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలో ఈమె పేరుగాంచిన నటి. ‘డ్యూల్ బంద్’, ‘భిర్గీత్’, ‘అబా’, ‘బ్యాక్ టు స్కూల్’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ఏర్పరుచుకుంది ఆర్యా ఘారే. బాలీవుడ్ స్టార్ సునీల్ షెట్టి, తమన్నా కలిసి నటించిన ‘ఏఏ బీబీ కేకే’ ఇంకా పలు బాలీవుడ్ చిత్రాల్లో ఈమె ఆర్యా ఘరే నటించిన సంగతి తెలిసిందే.మంగళవారం నాడు ఈమె పుట్టిన రోజు. అయితే తన పుట్టినరోజు వేడుకను ఈమె స్మశానంలో జరుపుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
మహారాష్ట్ర, పూణె లోని పింప్రి చించ్ వడ్ లోని ఓ స్మశాన వాటికలో ఈమె తన పుట్టిన రోజు వేడుకను జరుపుకుంది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు.అలాగే ఆర్యా ఘారే స్నేహితులతో పాటు ఆమె తల్లి కూడా ఈ వేడుకలో పాల్గొంది. వీళ్లందరి మధ్య ఆమె కేక్ కట్ చేసింది. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆమె తన పుట్టినరోజుని ఇలా సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు ఉన్నారు,ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈ టాపిక్ మాత్రం వైరల్ అవుతుంది.