Bhavana: అలాంటి ప్రశ్నలు వేసి వేధించారన్న భావన!

సౌత్ ఇండియాలో పాపులారిటీ ఉన్న నటీమణులలో భావన ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలతో ఈ హీరోయిన్ పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగులో ఈ హీరోయిన్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ఈ బ్యూటీ తెలుగుకు దూరం కావాల్సి వచ్చింది. అయితే కొన్నేళ్ల క్రితం ఈ హీరోయిన్ పై లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి స్టార్ హీరో దిలీప్ అని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

దిలీప్ ఈ కేసులో అరెస్ట్ కావడంతో పాటు కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు. కొన్ని రోజుల తర్వాత దిలీప్ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటన తర్వాత భావనకు సినిమా ఆఫర్లు తగ్గాయి. అయితే గతంలో ఈ కేసు గురించి స్పందించని భావన తాజాగా ఈ కేసు గురించి స్పందించడంతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తప్పేం లేకపోయినా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టే దిశగా భావన అడుగులు వేశారు.

లైంగిక దాడి జరిగిన తర్వాత తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటన తర్వాత కొంతమంది తనకు మద్దతు పలికితే మరి కొందరు తనపై విమర్శలు చేశారని ఆమె కామెంట్లు చేశారు. కొంతమంది తనదే తప్పని కామెంట్లు చేయడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. 2019 సంవత్సరంలో తాను సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో కొంతమంది చచ్చిపోవచ్చు కదా అని కామెంట్లు చేసి వేధింపులకు గురి చేశారని భావన అన్నారు.

మౌనం వహించడం వల్ల తన గురించి తప్పుగా ప్రచారం జరుగుతోందని భావించి సీఎంకు లేఖ రాశానని భావన తెలిపారు. భావన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి భావనకు ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus