భావనను పనివాళ్లే పాడుచేయడానికి ప్రయత్నించారు
- February 18, 2017 / 07:31 AM ISTByFilmy Focus
ఒంటరి, హీరో, మహాత్మా, నిప్పు సినిమాల్లో నటించి తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ భావన ఫై అత్యాచార ప్రయత్నం జరిగింది. ఊహించని పరిస్థితికి ఆమె కంగారు పడి.. చివరకు దుండగులు పారిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అసలు ఏమి జరిగిందంటే.. శుక్రవారం రాత్రి కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు అతాని ప్రాంతం వద్ద భావన కారును అడ్డుకుని డ్రైవర్ మార్టిన్ ని బయటకు లాగి, అందులోకి చొరబడి దారి మళ్లీంచారు. దాదాపు 25 కిలోమీటర్లు కదులుతున్న కారులో ఆమెను లైగింక వేధింపులకు గురిచేశారు. తరువాత పలరివత్తమ్ ప్రాంతంలో కారును ఆపి దుండగులు మరో కారులో పరారయ్యారు.
గంటన్నర పాటు నరకం చూసిన ఆమె కారును నడుపుకొంటూ దగ్గరలో ఉన్న ఓ నిర్మాత ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. నిర్మాతతో కలిసి భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఘటనలో ఆమె కారు డ్రైవర్ మార్టిన్ పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. భావన వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ పథకం వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో భావన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మార్టిన్‌కు తెలిసే సునీల్ భావనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














