Waltair Veerayya: చిరు సినిమాకి కేథరిన్ దూరం.. అదే కారణమా.?

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేథరిన్ ట్రెసా. ఆ తరువాత పలు సినిమా అవకాశాలు రావడంతో లీడ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్స్ కి ఫిక్స్ అయిపోయింది. మధ్యమధ్యలో ఒకట్రెండు ఐటెం సాంగ్స్ చేసింది. రీసెంట్ గా ‘బింబిసార’ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఆ తరువాత ఈమెకి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

మెయిన్ హీరోయిన్ శృతిహాసన్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ కి అవకాశం వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. కానీ ఇప్పటివరకు కేథరిన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆమె కనిపించలేదు. పోనీ బిజీగా ఉందా..? అంటే అదీ లేదు. ప్రస్తుతం ఆమె దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. ‘వాల్తేర్ వీరయ్య’ విషయంలో కేథరిన్ హర్ట్ అయిన కారణంగానే సినిమాను ప్రమోట్ చేయడం లేదని సమాచారం.

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అన్నప్పుడు చిరుతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని ఆశించింది కేథరిన్. అలానే సాంగ్స్ లో కూడా కనిపిస్తానని భావించింది. కానీ ఆమె ఆశించినట్లుగా జరగలేదు. చిరు నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కేథరిన్ ఐటెం సాంగ్ చేయాల్సింది. కానీ సుష్మిత కొణిదెలతో ఏర్పడిన చిన్న వివాదం కారణంగా కేథరిన్ కి ఛాన్స్ మిస్ అయింది.

ఈసారి ‘వాల్తేర్ వీరయ్య’లో కచ్చితంగా చిరుతో డాన్స్ నెంబర్ ఉంటుందనుకుంది. అందుకే టీమ్ తో ఎక్కడా గొడవ పడకుండా జాగ్రత్తగా నడుచుకుంది. అయినప్పటికీ.. ఆమెకి అవకాశం రాకపోవడంతో హర్ట్ అయిందని టాక్. అందుకే ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus