అబ్దుల్ కలాంతో హీరోయిన్.. వైరల్ అవుతున్న చైల్డ్ హుడ్ ఫోటో..!

ఇది వరకు హీరోయిన్ల అన్ సీన్ పిక్స్ చూడాలి అంటే మ్యాగ్జైన్లే దిక్కయ్యేవి..!కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత హీరోయిన్లే తమ అధికారిక ఖాతాల్లో చిన్నప్పటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. కొద్ది టైంలోనే అవి వైరల్ అయిపోతున్నాయి.ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటోకి ఓ విశిష్టత ఉంది. అదేంటి అంటే..

ఈ ఫోటోలో ఆమె దివంగత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించతగ్గ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో ఈ హీరోయిన్ కనిపిస్తుంది. ఇది ఆమె చిన్నప్పుడు స్కూల్లో తీసుకున్న ఫోటో.వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు స్లో అయ్యింది ఈ హీరోయిన్. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈమె కాలేజ్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. అప్పటి నుండి ఈమెకు సినిమాలపై ఆసక్తి నెలకొంది.

అక్కడ బేరీ జాన్, మనోజ్ బాజ్ పాయ్ ల వద్ద నటనలో శిక్షణ తీసుకుంది. తమిళంలో విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వెరమథిరి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈమె.. ఆ తర్వాత ధనుష్ నటించిన విఐపి (తెలుగులో రఘువరన్ బీటెక్) లో కూడా నటించింది నటించింది. తెలుగులో ‘బీరువా’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘జెంటిల్ మన్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. యెస్ ఆమెనే సురభి.అబ్దుల్ కలాంతో ఈమె దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus