సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో చాలామంది మాటల్లో సాధారణ ప్రేక్షకులపై చూపించే అభిమానం రియాలిటీలో చూపించరు. అయితే కొంతమంది మాత్రం సేవా కార్యక్రమాలు చేస్తూ తమ మంచి మనస్సును చాటుకుంటూ ఉంటారు. అలా మంచి మనస్సును చాటుకుంటున్న సెలబ్రిటీలలో దర్శ గుప్తా కూడా ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో నటించడానికి ఇష్టపడే ఈ బ్యూటీ అనాథ శరణాలయంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం గమనార్హం.
గతంలో కూడా పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలిచిన దర్శ గుప్తా చాలా సందర్భాల్లో పుట్టినరోజు వేడుకలను అనాథ శరణాలయాల్లో జరుపుకోవడం ద్వారా ప్రశంసలు పొందుతున్నారు. ఎంతోమంది హీరోయిన్లతో పోల్చి చూస్తే దర్శ గుప్తా గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చీరకట్టులో అనాథ పిల్లలకు దర్శ గుప్తా స్వయంగా తన చేతుల మీదుగా ఆహారం వడ్డించడం గమనార్హం.
పిల్లలతో కలిసిపోయి వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడిన ఈ హీరోయిన్ తల్లి లేని పిల్లలకు అందరూ తల్లులే అని చెప్పుకొచ్చారు. నా పుట్టినరోజు వేడుకలను దేవుడి బిడ్డలతో జరుపుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. దర్శ గుప్తా మనస్సు కూడా అందంగా ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. దర్శ గుప్తా టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. దర్శ గుప్తా ఓ మై ఘోస్ట్, రుద్ర తాండవం సినిమాలలో నటించారు. దర్శ గుప్తా టాలెంట్ కు మరింత గుర్తింపు దక్కాల్సి ఉందని నెటిజన్లు చెబుతున్నారు. దర్శ గుప్తా రేంజ్, క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. దర్శ గుప్తా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.