Actress: భర్త చనిపోయిన ఐదోరోజే షూటింగ్ కు వెళ్లా.. నటి కామెంట్స్ వైరల్!

  • May 16, 2023 / 06:15 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన డబ్బింగ్ జానకి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ గడిచిన రోజులే మంచిగా అనిపిస్తాయని రాబోయే రోజులు భయంకరంగా ఉంటాయేమో అనిపిస్తుందని తెలిపారు. పాత రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని డబ్బింగ్ జానకి అన్నారు. అప్పట్లో ఒక సినిమాకు నాకు 750 రూపాయలు పారితోషికం ఇచ్చారని ఆ డబ్బులే నాకు ఎక్కువ మొత్తమని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.

నా (Actress) బాల్యం పెద్దాపురంలో గడిచిందని అశాంతి అనే నాటకంతో నా ప్రయాణం మొదలైందని ఆమె అన్నారు. మాది లవ్ మ్యారేజ్ అని మాకు ముగ్గురు పిల్లలు అని డబ్బింగ్ జానకి పేర్కొన్నారు. నేను ఎక్కడ నటించినా నా పని చూసుకుని వచ్చేస్తానని ఆమె కామెంట్లు చేశారు. ఉన్నంతలో తృప్తిగా ఉండటమే నా హెల్త్ సీక్రెట్ అని డబ్బింగ్ జానకి పేర్కొన్నారు. సావిత్రి గారితో కలిసి చాలా సినిమాలలో నటించానని సావిత్రి గారు సెట్ లో సరదాగా ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.

రామారావు గారంటే నాకు భయం, భక్తి అని ఏఎన్నార్ గారు చాలా సరదాగా ఉండేవారని డబ్బింగ్ జానకి కామెంట్లు చేశారు. కె.విశ్వనాథ్ గారు చెప్పిన దానిలో 50 శాతం చేసినా స్క్రీన్ పై 100 శాతం కనిపిస్తుందని డబ్బింగ్ జానకి పేర్కొన్నారు. నాకు, ఒక నటికి ఒకే గది ఇచ్చారని మాకు పంపిన బాక్స్ లో నేను కొంచెం తినేసి పడుకున్నానని ఆమె తెలిపారు.

ఆవిడ వచ్చి క్యారేజ్ బాక్స్ ను కాలితో తన్నిందని జానకి కామెంట్లు చేశారు. కలెక్టర్ గారు సినిమా షూటింగ్ సమయంలో మా వారు చనిపోయారని ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టకూడదని భావించి ఐదోరోజు షూటింగ్ కు వెళ్లానని ఆ బాధను మనస్సులో పెట్టుకుని నటించానని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus