Actress Gajala: హీరోయిన్ గజాల ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి?

జగపతి హీరోగా తెరకెక్కిన ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది గజాల. ఈమె పూర్తి పేరు గజాల షేక్ ఖాన్. అయితే ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో ఈమె టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. అటు తర్వాత ‘ఓ చినదాన’ ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ ‘మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఎందుకో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ .. వంటి అగ్ర హీరోలతో కూడా నటించినా ఈమెకు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 2002 వ సంవత్సరంలో జూలై 22న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె సహ నటులు సుల్తానా,

అర్జున్ సరైన సమయానికి ఈమె పరిస్థితి చూసి అక్కడి నిమ్స్ ఆసుపత్రికి తరలించడంతో ఈమె బ్రతికి బయటపడింది. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. గతంలో హీరో ఆదిత్య ఓం ను ఈమె ప్రేమించినట్టు, డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

బహుశా వీళ్ళు బ్రేకప్ అవ్వడం వల్ల గజాల డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus