లాక్‌డౌన్ టైములో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఓ పనిని చక్క పెట్టేసుకున్నారు. షూటింగ్ లతో బిజీగా ఉండే వీళ్లకు మళ్ళీ ఇలాంటి టైం దొరుకుతుందో.. దొరకదో.. అని భావించి చాలా మంది పెళ్లిళ్లు చేసేసుకుంటున్నట్టు తెలుస్తుంది. గ్రాండ్‌గా చేసుకోవాలి అనుకునే వాళ్ళను పక్కన పెడితే.. సింపుల్ గా పెళ్లి చేసుకోవాలి అనుకున్న సెలబ్రిటీలకు మాత్రం ఈ సీజన్ బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇప్పటి వరకూ హీరోలు, కమెడియన్ లు పెళ్లిళ్లు చేసుకుంటూ వచ్చాము.
ఇప్పుడు శాండిల్‌వుడ్‌కు చెందిన హీరోయిన్ మయూరి క్యాటరీ కూడా సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకుంది. ‘తన స్నేహితుడైన అరుణ్‌ను ఆమె జూన్ 12న (శుక్రవారం) ఉదయం స్థానిక శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అతి తక్కువ మంది సమక్షంలో ఈమె పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. ఈమె స్నేహితులు, బంధువులు సమక్షంలో జరిగిన మయూరి, అరుణ్ ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మయూరినే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసే వరకు తన పెళ్లి గురించి అటు అభిమానులకు గాని, ఇటు సినీ వర్గాల వారికి కానీ తెలియకపోవడం గమనార్హం.‘అరుణ్, నేను ఇవాళ ఉదయం పెళ్లి చేసుకున్నాం. పదేళ్ల స్నేహానికి శుక్రవారం అర్ధవంతమైన ముగింపు లభించింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలియజేస్తాను’ అంటూ మయూరి తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!