సినీ పరిశ్రమలో నటీనటులు ఎక్కువ కాలం కొనసాగాలి అంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది.యోగాలు,జిమ్ లు.. ఇలాంటి రకరకాల వర్కౌట్లు చేయాలి. మరీ ముఖ్యంగా నటీమణులు తమ గ్లామర్ ను కాపాడుకుంటూ ఉంటేనే దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తారు. లేదంటే.. కష్టమే.హీరోయిన్లు గ్లామర్ గా కనిపించడానికి రూ.9000 పెట్టి ఓ ఇంజక్షన్ చేయించుకోవాలి అంటూ ఓ నటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇంజక్షన్ ఏంటి అన్నది ఆ నటి వెల్లడించలేదు.
అంతేకాకుండా మరికొంత మంది నటీమణులు అయితే సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇవి కనుక వికటిస్తే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం చూశాం. ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటున్న తరుణంలో ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన సంఘటనలు అనేకం ఉన్నాయి .ఇటీవల మరో నటి తన అందాన్ని కాపాడుకోవడానికి సర్జెరీ చేయించుకునేందుకు రెడీ అయ్యింది.. ఆ సర్జెరీ వికటించడంతో ఆమె మొహం రూపురేఖలు లేకుండా అయిపోయింది.
వివరాల్లోకి వెళితే.. ‘ఎఫ్‌ఐఆర్’, ‘6 టు 6’ వంటి కన్నడ చిత్రాల్లో నటించిన స్వాతి సతీష్ …. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ ఆసుపత్రిలో రూట్ కెనాల్ థెరపీ కోసం చేరింది. అయితే ఆ సర్జెరీ వికటించింది.దీంతో ఆమె మొహం మొత్తం వాచిపోయినట్టు అయిపోయింది. సాధారణంగా ఇలాంటి సర్జరీ చేయించుకున్నప్పుడు ఇలాంటి వాపు రావడం మామూలే. అయితే అది.. వారం రోజుల లోపే తగ్గిపోతుంది.
కానీ 3 వారాలు దాటినా స్వాతి సతీష్ మొహం ఆ వాపు నుండి రికవరీ అవ్వలేదు. అంతేకాకుండా ఆమెకు నొప్పి కూడా ఎక్కువైందట. ఆమె మొహం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.దీంతో ఆమె ఎంపికైన సినిమాల నుండీ… ఆమెను తొలగించడానికి దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అని తెలుస్తుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!