రెండు నెలలుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడటం మనం చూసాం. సినిమా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరొకరు మృతి చెందుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది నటులు, నిర్మాతలు,దర్శకులు, సింగర్లు మృతి చెందగా…. బిగ్ బాస్ కంటెస్టెంట్ బీజేపీ నాయకురాలు అయిన సోనాలీ ఫోగాట్ …కూడా గుండెపోటుతో మరణించిన సందర్భాన్ని మనం చూశాం.
అంతేకాదు దర్శకుడు చంద్ర సిద్దార్థ్ సోదరుడు కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగులోనే కాకుండా హాలీవుడ్లో కూడా సినిమాలు తెరకెక్కించి నిర్మించాడు. ఇలాంటి బాడ్ న్యూస్ ల నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోక ముందే మరో నటి తాజాగా మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి హ్యాపీ భావ్‌సర్ నాయక్ లాంగ్ క్యాన్సర్ తో మరణించింది. నటుడు మౌలిక్ నాయక్ భార్య అయినటువంటి హ్యాపీ నాయక్.. ‘మోంటు నీ బిట్టు’, ‘ప్రేమ్‌జీ: రైజ్ ఆఫ్ ఏ వారియర్’ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.
అయితే గురువారం నాడు అంటే ఆగస్టు 25న లంగ్ క్యాన్సర్ తో ఆమె తుదిశ్వాస విడిచినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు.అహ్మదాబాద్‌లో ఈమె మరణించారు అని స్పష్టమవుతుంది.సినిమా బ్యాక్ గ్రౌండ్ కు చెందిన ఫ్యామిలీలో జన్మించిన ఈమె .. గునేగర్, టంఖా సీరియల్స్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసింది. ఆమె కాలేజీలో ఉన్నప్పుడు కూడా చాలా స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది.గుజరాతీ ఇండస్ట్రీ చెందిన సినీ ప్రముఖులు ఈమె మరణానికి చింతిస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.