సమంత (Samantha) కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ (Raj Nidimoru) నిడిమోరు ను ఈరోజు వివాహం చేసుకుంది. బెంగళూరులో ఉన్న ఈశా సెంటర్‌లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. సమంత,రాజ్..ల కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. ఈశా వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశీస్సుల కోసం అని సమంత.. రాజ్ ను అక్కడే వివాహం చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఉదయం నుండి వీరు పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు.
కొద్దిసేపటి క్రితం సమంత తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని ధృవీకరించి. ఈరోజు డిసెంబర్ 1(01-12-25) అనే డేట్ ను కామెంట్ గా పెట్టి ఈ ఫోటోలు షేర్ చేసింది. ఇలా సమంత డేట్ ని కామెంట్ గా పెట్టడం వెనుక ఒక రివెంజ్ డ్రామాని కూడా మనం అర్ధం చేసుకోవచ్చు. ఆమె మాజీ భర్త, టాలీవుడ్ హీరో అయినటువంటి నాగ చైతన్య.. హీరోయిన్ శోభితని వివాహం చేసుకున్నప్పుడు కూడా డేట్ ని ప్రత్యేకంగా హైలెట్ చేశారు. సో అందుకు సమంత ఇప్పుడు తన 2వ పెళ్లి డేట్ ను హైలెట్ చేసినట్టు నెటిజెన్లు చెప్పుకుంటున్నారు. అందులో ఎంత వరకు నిజముందో తెలీదు.

సమంత 2017 లో నాగ చైతన్యని వివాహం చేసుకుంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021 లో విడిపోయారు. సమంత నటించిన ‘ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్లో ఉన్న ఇంటి*మేట్ సీన్ల కారణంగానే సమంత – నాగ చైతన్య..ల మధ్య గొడవలు వచ్చినట్టు అంతా చెప్పుకున్నారు. అయితే ఫైనల్ గా ఫ్యామిలీ మెన్ క్రియేటర్ అయిన రాజ్ నే సమంత వివాహం చేసుకోవడంతో.. ఆ ప్రచారమే నిజమై ఉండొచ్చు అని ఇప్పుడు అంతా భావిస్తున్నారు.
1

2

3

4

5

