Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా

  • December 1, 2025 / 02:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు  బుచ్చిబాబు సనా

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం(Sahakutumbanam). రామ్ చరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. విడుదల తేదీ దగ్గరవుతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదగా సఃకుటుంబానాం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బుచ్చిబాబు సనా మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన నాన్నకు ప్రేమతో, ఆర్య 2 చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఇప్పుడు వారి పక్కన నిలబడి డైరెక్టర్ గా మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నా స్నేహితుడు విక్రమ్ ఒక లైన్ సినిమాగా చేయాలి అనుకున్నాడు కానీ ఆయన చనిపోవడం జరిగింది. అదే లైన్ ను తన స్నేహితుడు ఉదయ్ ఒక కథగా మార్చి ఆ కథను సినిమాగా చేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ సినిమా సుకుమార్ గారి ఐడియాలో ఉండబోతుంది. సఃకుటుంబానాం చిత్రం మంచి విజయం సాధించాలని నటీనటులకు, నిర్మాతకు, సాంకేతిక బృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్” అన్నారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… “సభా సరస్వతికి, నా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మానందం మరొకసారి కలిసిన నటించడం, మధు పనిచేసిన వారంతా ఉన్నత స్థాయిలకు అడగడం, వారిని ఈ స్టేజిపై చూడటం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఒక నటుడు ఎంతో కాలం పాటు చిత్ర పరిశ్రమలో కనిపిస్తూ ఉండటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక నటుడు అలా కనిపించాలి అంటే తాము వేసే పాత్ర ప్రేక్షకులను అంతగా మెప్పించాలి. వివిధ ప్రాంతీయ భాష యాసాలను సినిమాలలో మాట్లాడుతూ ప్రతి ప్రాంతం వారికి దగ్గర వాడిని అయ్యాను. ఒక కొత్త పాత్రతో మా దగ్గరకు కథ వచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపోతూ ఉంటాము. సఃకుటుంబానాం వంటి కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నన్ను ఒక నటుడుగా తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర నేర్చుకున్న పని అందరికీ ఉపయోగపడటం గర్వించదగిన విషయం. ‘ఆ నలుగురు’ సినిమాలో నన్ను చూసినవారు అంత రాజేంద్రప్రసాద్ ఇటువంటి పాత్రనైనా చేయగలనుకున్నారు. సఃకుటుంబానాం వంటి సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర చాలా ఛాలెంజ్ లు ఉన్నాయి. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రం సఃకుటుంబానాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ కిరణ్ ఎంతో శ్రద్ధతో నేర్చుకుని నటించారు. అలాగే ఈ సినిమాలో నటీనటులు అంతా కూడా అద్భుతంగా నటించారు. నిర్మాత మహదేవ్ గౌడ్ గారు ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలని, తరువాత తరాలకు ఉపయోగపడే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సఃకుటుంబానాం చిత్రాన్ని థియేటర్ లో చూడాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాను” అన్నారు.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ సినిమాకు దర్శకుడు ఉదయ్ శర్మ తనకు కావలసిన ఔట్పుట్ వచ్చేవరకు కచ్చితంగా చూసుకుని అద్భుతమైన దర్శకుడు. అతడి వెనుక అర్జున్ సాయి ఉన్నాడు. అతను ప్రతి విషయంలను అండగా ఉండి నడిపిస్తుంటాడు. మా గురువుగారు రాజేంద్రప్రసాద్ గారి చేత కూడా తనకు ఎలా కావాలి అనుకున్నారో అలా నటించేలా చేసి అవుట్ పుట్ తీసుకున్నారు. నిర్మాత మహదేవ్ గౌడ్ గారికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా చిత్రంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ చరణ్ ఒక డాన్సర్. హీరో, హీరోయిన్ కలిసి ఉండే కొన్ని సీన్స్ లో నేను నటించాను. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమాను మంచి విజయం చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత మహదేవ్ గౌడ్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. సఃకుటుంబానాం హెచ్ ఎన్ జి బ్యానర్ పై తొలి చిత్రం. ఈ సినిమా కథ నాకు చాలా నచ్చి కావలసిన నటీనటులను, టెక్నీషియన్స్ ను అందరిని కష్టపడి ఈ చిత్రంలో పాలుపంచుకునేలా చేశాము. ఈ సినిమాలో అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు ఉదయ్ శర్మ మాట్లాడుతూ… “ముందుగా సఃకుటుంబానాం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన బుచ్చిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రాజేంద్రప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, మణిశర్మ గారికి తదితరులకు అందరికీ మా కోసం ఈ సినిమా చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ స్టేజ్ పై ఉండటానికి ముఖ్య కారణం నా స్నేహితుడు విక్రమ్, అర్జున్ సాయి, నిర్మాత మహదేవ్ గౌడ్. మా హీరో రామ్ కిరణ్, హీరోయిన్ మెగా ఆకాష్ ఎంతో పెర్ఫెక్ట్ గా నటించారు. నా తొలి చిత్రానికి మని శర్మగారు సంగీతం అందించడం అనేది ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాను. మా డిఓపి మధు తన ఈ తొలి చిత్రంలోనే మంచి విజువల్స్ చూపించారు. సినిమాకు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో రామ్ కిరణ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నన్ను హీరోగా నమ్మి ముందుకు వచ్చిన నిర్మాత మహదేవ్ గౌడ్ గారికి నా థ్యాంక్స్. హీరో కావడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను, ఎన్నో కథలో విన్నాను. నాకు ఎంతో ఇష్టమైన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాను. అందరూ ఈ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. దీనికి ముఖ కారణమైన నిర్మాతలకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన మెగా ఆకాష్ గారితో నేను నటించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆమెతో కలిసి పని చేస్తూ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా దర్శకుడు ఉదయ్ శర్మ గారు ఒక కథ తీసుకుని, ఆ కథ చుట్టూ ఒక కుటుంబాన్ని సృష్టించుకోవడం గొప్ప విషయం. మణిశర్మ గారు మా సినిమాకు సంగీతం అందించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. 16 సంవత్సరాల నా కల హీరో కావడం. దీనికి కారణం నా గురువులు, వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. నా సినిమా కోసం కొరియోగ్రఫీ చేసిన నా డాన్స్ మాస్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన బుచ్చిబాబు గారికి, మాతో కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అల్లు అర్జున్ గారి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా స్ఫూర్తి అల్లు అర్జున్ గారు, కచ్చితంగా ఒక రోజు ఆయనతో కలిసి పనిచేస్తాను. అందరూ ఈ సినిమాకు సపోర్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

తారాగణం:
రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు.

సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ఉదయ్ శర్మ
నిర్మాత: హెచ్ మహదేవ గౌడ్
సంగీతం: మణి శర్మ
DOP: మధు దాసరి
ఎడిటర్: శశాంక్ మలి
కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పొలాకి
సాహిత్యం: అనంత శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: P.S. వర్మ
ఫైట్స్: అంజి, కార్తీక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రోహిత్ కుమార్ పద్మనాభ
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ : డిజిటల్ దుకాణం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhadram
  • #Brahmanandam
  • #Buchi Babu Sana
  • #Giridhar
  • #megha akash

Also Read

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

related news

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం”

డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం”

trending news

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

1 hour ago
Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

4 hours ago
Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

20 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

21 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

23 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

20 hours ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

20 hours ago
Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

21 hours ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

21 hours ago
The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version