భర్తతో లేడీ కమెడియన్ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఫిబ్రవరి 14న అందరూ వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.. దీంతో సోషల్ మీడియా అంతా సందడిగా మారింది.. పాపులర్ కోలీవుడ్ లేడీ కమెడియన్ హారతి గణేష్ కూడా తన భర్తతో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది..

హారతి తమిళనాట దాదాపు 200లకు పైగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమే.. ఆమె నటుడు గణేష్కర్‌ని లవ్ మ్యారేజ్ చేసుకుంది.. భర్తతో కలిసి వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ షేర్ చేసింది.. నువ్వు నా ఊపిరి.. నీతో ఉంటే 365 రోజులూ వాలంటైన్ డేనే అంటూ హారతి తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus