Haripriya Vasishta Marriage: ‘పిల్ల జమీందార్’ బ్యూటీతో ‘కేజీఎఫ్’ యాక్టర్ పెళ్లి!

కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకుంది నటి హరిప్రియ. ఆ తరువాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. ‘పిల్ల జమీందార్’, ‘జై సింహా’ వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తరువాత టాలీవుడ్ లో ఈమె పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా ఓ నటుడితో ప్రేమలో ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అతడినే పెళ్లాడి మరోసారి వార్తల్లో నిలిచింది.

హరిప్రియ కొన్నాళ్లుగా కన్నడ నటుడు వశిష్ట సింహాతో రిలేషన్ లో ఉంది. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. మైసూరులో జనవరి 25న వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కన్నడ నటుడు ధనుంజయ ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులతో తీసుకున్న ఫొటోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

గతేడాది డిసెంబర్‌లోనే వీరికి నిశ్చితార్థం జరిగింది. దానికి సంబంధించిన పిక్స్‌ను హరిప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ”నా పేరు చివరన త్వరలోనే సింహా ట్యాగ్ రాబోతుంది. ఈ ట్యాగ్‌తో నేను ప్రేమలో పడిపోయాను. మా రింగ్స్‌లో ఆ పేరు ప్రతిబింబించాలనుకున్నాను. సింహాలతో ఉంగరాలను కస్టమ్ డిజైన్ చేయించాం” అని హరిప్రియ చెప్పింది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus