క్యాన్సర్ భారిన పడిన ప్రముఖ నటి.!

బాలీవుడ్‌ బ్యూటీ హీనా ఖాన్‌ క్యాన్సర్ భారిన పడినట్టు తెలిపింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘అందరికి నమస్తే.. గత కొంత కాలం నుండి ఓ రూమర్‌ నేను రెగ్యులర్ గా వింటున్నాను. దీంతో అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలచుకున్నాను. నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాల్సిందే. నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌..అది మూడో స్టేజ్‌లో ఉంది.

దీనికి చికిత్స కూడా తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. దీనికి నుండి కోలుకుంటాననే ధైర్యం, నమ్మకం.. నాలో ఉన్నాయి. క్యాన్సర్‌ నుండి కోలుకోవడానికి ఏదైనా చేస్తాను. కానీ ఈ టైంలో నాకు కావాల్సింది కాస్త ప్రైవసీ. అందుకు సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. హీనా ఖాన్‌.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

హిందీలో సూపర్‌ హిట్టు అయిన ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ అనే సీరియల్ ‘నూరేళ్ల పంట’ పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. అందులో ఈమె ప్రధాన పాత్ర పోషించింది. అలాగే నాగిన్‌ సీజన్‌ 5 లో కూడా నటించింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా ఈమె ఆడిపాడింది. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈమె క్యాన్సర్ ను జయించడం అనేది పెద్ద విషయం కాదని.. కచ్చితంగా ఈమె మామూలు మనిషి అవుతుందని అంతా భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus