Honey Rose: ‘వీర సింహా రెడ్డి’ వైఫ్ అంటే ఈమాత్రం ఉండాలి.. హనీ రోజ్ వీడియో వైరల్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ – యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల కలయికలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. లాల్, ‘దునియా’ విజయ్, హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ హనీ రోజు.. ‘వీర సింహా రెడ్డి’ భ్యార్య మీనాక్షి రెడ్డి క్యారెక్టర్ చేస్తోంది..

ఇంతకుముందు ఒకటీ, రెండు తెలుగు సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు కానీ ఈ మూవీ రిలీజ్ అవకుండానే మంచి పాపులారిటీ వచ్చిందామెకి.. ఇప్పుడు నెట్టింట హనీ రోజ్ వీడియో ఒకటి బాలయ్య ఫ్యాన్ పేజీల్లో బాగా వైరల్ అవుతోంది.. తన స్టాఫ్‌తో కలిసి శారీలో నడుచుకుంటూ వస్తున్న వీడియో బాగా ఎడిట్ చేసి.. ‘వీర సింహా రెడ్డి వైఫ్ అంటే ఈమాత్రం ఉండాలి’ అంటూ బాలయ్య అభిమానులు హనీ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటుందీ మలయాళ ముద్దుగుమ్మ వీడియో.. కన్నడలోనూ మూవీస్ చేసిన హనీ.. ‘వీర సింహా రెడ్డి’ తో తెలుగులో బ్రేక్ వస్తుందనే హోప్‌తో ఉంది..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus