Janhvi Kapoor: నన్ను అపార్ధం చేసుకున్నారు.. హీరోయిన్ క్లారిటీ!

సోషల్ మీడియాలో జనాలు తనను అపార్ధం చేసుకున్నారని.. బాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ వాపోతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జాన్వీకపూర్ ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు షేర్ చేసింది. దేశమంతా కరోనాతో వణికిపోతుంటే.. అందాల ప్రదర్శనకు ఇది సమయమా అంటూ జాన్వీ కపూర్ ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇది బాధ్యతా రాహిత్యం అంటూ మండిపడ్డారు.

ఇలాంటి ఫోటోలు పెట్టడానికి ఒక్కసారి కూడా ఆలోచించరు కదా..? అంటూ జాన్వీపై కామెంట్స్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు చక్కబడే వరకు అయినా.. అంగాంగ ప్రదర్శన ఆపలేరా అంటూ నిలదీశారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ వివరణ ఇవ్వక తప్పలేదు. నిజాలు తెలుసుకోకుండా.. తనను ట్రోల్ చేస్తున్నారని వాపోయింది. సదరు హాట్ ఫోటోలు.. లాక్ డౌన్ కి ముందు ఓ మాస్ పత్రిక కవర్ పేజీ కోసం చేసిన ఫోటోషూట్ కి సంబంధించిన స్టిల్స్ అని చెప్పుకొచ్చింది.

ఈ విషయం తెలియని నెటిజన్లు తనను అపార్ధం చేసుకొని ట్రోల్ చేస్తున్నారని బాధను వ్యక్తం చేసింది. తనకు కూడా సామాజిక బాధ్యత ఉందని.. కరోనా నుండి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘రూహి’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం ఈమె ‘దోస్తానా 2’, ‘గుడ్ లాక్ జెర్రీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

13


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus