Janhvi Kapoor: పెళ్ళికి ముందే ప్రియుడితో కలిసి తిరుమలలో దర్శనమిచ్చిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్!

సౌత్ లోని అన్ని భాషలతో పాటు నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీదేవి. వందల సంఖ్యలో సినిమాలు చేసి తన అందంతో బాక్సాఫీస్ ను షేర్ చేసిన ఘనత ఈమె సొంతం. 2018 సంవత్సరంలో ఫిబ్రవరి 24న అనూహ్యంగా దుబాయ్ లోని ఓ హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్తతో యావత్ సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయినట్లు అయ్యింది. అయితే ఆమె చనిపోవడం అనేది శ్రీదేవి కుటుంబానికి పెద్ద నష్టం తెచ్చి పెట్టినట్టు అయ్యింది.

ఎందుకంటే ఆమె తన కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ను స్టార్ హీరోయిన్ ను చేయాలని చాలా కలలు కన్నది. జాన్వీ డెబ్యూ.. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావాలని చెప్పి ‘ధడక్’ అనే చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. కానీ కూతురు డెబ్యూ చూడకుండానే శ్రీదేవి చనిపోయింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా జాన్వీ తన గాసిప్ ప్రియుడు అయినటువంటి శిఖర్ పహారియాతో కలిసి తిరుమలలో మెరిసింది. వీళ్ళిద్దరూ కలిసి తిరుమల శ్రీవారి సన్నిధిలో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో జాన్వీ ట్రెడిషనల్ వేర్ లో చాలా చక్కగా కనిపిస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus