Jayasudha: నితిన్ కపూర్ కాదు జయసుధ మొదటి భర్త ఎవరంటే..!

Ad not loaded.

సహజనటిగా పేరొందిన జయసుధ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఎంతో మంది స్టార్ హీరోలకు జోడీగా నటించింది. అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ఇప్పటికీ నటిస్తూనే ఉంది. అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నారో అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా అంతే బిజీగా గడుపుతూ వస్తున్నారు జయసుధ.

ఈమె అసలు పేరు సుజాత అయినప్పటికీ నటిగా మారాక జయసుధగా పేరు మార్చుకున్నారు. కృష్ణగారి రెండో భార్య మరియు ప్రముఖ నటి,దర్శకురాలు, నిర్మాత అయిన విజయనిర్మల గారికి ఈమె మేనకోడలు అవుతారు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. 1972వ సంవత్సరంలో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమా ద్వారా జయసుధ నటిగా పరిచయమయ్యారు.అటు తర్వాత ఈమె జర్నీ అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా..

జయసుధ ఓ వ్య‌క్తితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ ఆ తర్వాత ఆమెకు పలు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాలామంది జయసుధ భర్త కేవలం నితిన్ కపూర్ అనే అనుకుంటారు. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే… నితిన్ కపూర్ కంటే ముందు మరో వ్యక్తి ని పెళ్లాడింది జయసుధ. నితిన్ కపూర్ మరణించిన సమయంలో వడ్డే నవీన్ తండ్రి.

ప్రముఖ నిర్మాత అయినా వడ్డే రమేష్ జయసుధ మొదటి భర్త అని, వడ్డే నవీన్ ఆమెకు కొడుకు అవుతాడంటూ పలు రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అందులో నిజం ఎంత మాత్రం లేదు. జయసుధ మొదటి భర్త పేరు కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్. ఓ సినిమా షూటింగ్లో వీళ్ళు కలుసుకోవడం, తర్వాత ప్రేమించుకోవడం.. అది పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. అయితే మనస్పర్థలు రావడంతో వీళ్ళు విడిపోయారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus