Actress Jayavani: ఆ ఫోటో షూట్లో పాల్గొనడం నా కెరీర్ కు పెద్ద మచ్చ: జయవాణి

ఒకప్పుడు జయమాలిని, జయలలిత మాదిరి ఇప్పుడు టాలీవుడ్ లో వ్యాంప్ రోల్స్ చేసే నటీమణులు చాలా తక్కువ మందే ఉన్నారు. నటి జ్యోతి, కరాటే కళ్యాణి,అపూర్వ, జయవాణి వంటి వారు ఆ కోవకి చెందిన వాళ్ళే.వీరిలో ఇప్పుడు నటి జయవాణి మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.’యమదొంగ’ ‘మర్యాద రామన్నా’ ‘పంచాక్షరీ’ ‘విక్రమార్కుడు’ ‘భరత్ అనే నేను’ ‘గుంటూర్ టాకీస్’ మొదలగు చిత్రాల్లో నటించి ఈమె ప్రేక్షకుల్ని అలరించింది.అయితే గతంలో ఈమె టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చి షాకిచ్చింది.

జయవాణి మాట్లాడుతూ.. “మిగిలిన రంగాలతో పోలిస్తే సినీపరిశ్రమలో ఇబ్బందులు చాలానే ఉంటాయి.నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ‘నల్లగా ఉన్నావు .. నటిగా నువ్వు సెట్ కావు’ అని అవమానించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అయితే ఎలాగైనా నేను నటిగా ఇండస్ట్రీలో కొనసాగాలి… అని నన్ను నేను నిరూపించుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించేదాన్ని. ఆ క్రమంలో అవకాశాలు రావడం మొదలయ్యాక.. ఎంత చిన్న పాత్ర అయినా అంగీకరించి చేసేదాన్ని.

నా పాత్రకి 100 శాతం న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రమే నాలో ఉండేది.అయితే నన్ను బాధపెట్టే చేదు అనుభవం కూడా ఒకటి ఉంది.గతంలో ఓ దర్శకుడు నాకు ఫోన్ చేసి మీ కోసం ఓ పాత్ర ఉంది. వచ్చి కలవాలని కోరాడు. నేను వెళ్ళాను. ‘ప్రేమ్ నగర్’ చిత్రంలో రమాప్రభ లాంటి పాత్ర అని, కాస్ట్యూమ్స్ లంబాడి తరహాలో ఉండాలని చెప్పాడు. మీరు ఈ రోల్ సరిగ్గా సెట్ అవుతారని…అందుకోసం మొదట ఫోటో షూట్ చేయాలని చెప్పాడు.సరే అని ఆ కాస్ట్యూమ్స్ లో నేను ఫోటోషూట్ కు రెడీ అయ్యాను.ఆ సమయంలో డిఫెరెంట్ యాంగిల్స్ లో చాలా ఫోటోలు తీశారు.

‘4,5 ఫోటోలు సరిపోతాయి కదా అండి ఇన్నెందుకు’ అని నేను అంటే.. ‘ఇది ఫోటో షూట్ కదా’ అని నాకు బదులిచ్చారు. సర్లే అని ఆ ఫోటో షూట్ చేసి వెళ్ళాను.కానీ వాళ్ళ నుండీ ఫోన్ రాలేదు.అంతేకాకుండా నా అనుమతి లేకుండా ఆ ఫొటోల్ని ఇంటర్నెట్ లో లీక్ చేసేశారు. అదేమని ప్రశ్నించడానికి నేను వెళ్తే అక్కడ దర్శకుడు, నిర్మాత, కెమెరా మెన్ ఎవ్వరూ లేరు. వాళ్ళంతా కొత్తవాళ్లు కావడంతో… నేను వాళ్ళ నంబర్స్ తీసుకోలేదు. దీంతో ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో అలాగే ఉన్నాయి. అవి నా కెరీర్ కే మచ్చగా మిగిలిపోయాయి” అంటూ చెప్పుకొచ్చింది జయవాణి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus