Kajal: ఓ బిడ్డకు తల్లైనా… కాజల్ గ్లామర్ షో తగ్గలేదుగా .. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

రెండు , మూడు రోజుల క్రితం కాజల్ ను మన సౌత్ ప్రేక్షకులు తెగ పొగిడేశారు. ఎందుకంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో పోలిస్తే సౌత్ ఫిల్మ్ మేకర్స్ చాలా డిసిప్లిన్ గా ఉంటారని.. ఆ విషయంలో కూడా బాలీవుడ్ సౌత్ తో పోలిస్తే కిందే ఉందని ఆమె కామెంట్ చేసింది. కాజల్ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్ చేసిందో మనకు అనవసరం..కానీ సౌత్ సినిమా గొప్పతనాన్ని చాలా బాగా చెప్పింది అంటూ అంతా మురిసిపోయారు.

సౌత్ సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత ఇక్కడ ఆఫర్ లు తగ్గితే బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ మీడియా ముందు సౌత్ సినిమాలను తక్కువ చేసిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. తాప్సి దగ్గర నుండీ లెక్కపెడితే .. రాశీ ఖన్నా , రష్మిక మందన కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. బాలీవుడ్ లో ఇంటర్వ్యూ ఇవ్వడమే ఆలస్యం ఇలాంటి విమర్శలు చేసే బ్యాచ్ చాలా మందే ఉన్నారు.

అందుకే కాజల్ (Kajal) ను సౌత్ జనాలు తెగ పొగిడేసి సోషల్ మీడియాలో ఆమెను ట్రెండింగ్ లో నిలబెట్టారు. ఇదిలా ఉండగా.. కాజల్ ప్రస్తుతం పలు ఓటీటీ… ప్రాజెక్టుల్లో నటిస్తూనే మరోపక్క బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. పెళ్ళైనా.. తల్లైనా ఈ అమ్మడు తగ్గేదేలే అన్నట్టు గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

 

 

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus