Kalpika Ganesh: హాస్పిటల్ పాలైన కల్పిక గణేష్.. మేటర్ ఏంటి?

కల్పిక గణేష్ పరిచయం అవసరం లేని పేరు. కొద్దిరోజులుగా ఆమె పేరు హాట్ టాపిక్ అవుతుంది. అది ఎందుకు అన్న సంగతి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె పై కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ అభినవ్ గోమటం తనని అవమానించాడంటూ తెలిపి అందరికీ షాకిచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే.. తనకు కూడా సమంతలానే మయోసిస్ ఉందంటూ కల్పిక తెలిపింది. దాదాపు 10 ఏళ్ళ పై నుండి ఈమె మయోసిస్ తో బాధపడుతున్నట్లు తెలిపి షాకిచ్చింది.

విచిత్రం ఏంటంటే సమంతతో కలిసి కల్పిక ‘యశోద’ సినిమాలో నటించింది. అంతకు ముందు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. అయితే సమంత వ్యాధి థర్డ్ స్టేజ్ లో ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా..కల్పిక తాజాగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది.విషయం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా కల్పిక రాడిక్యులర్ పెయిన్ తో బాధపడుతుందట. రాడిక్యులర్ పెయిన్ అనగా వెన్నుముక వద్ద నొప్పి కలగడం.

ఇందువల్ల ఆమె ఎక్కువ సేపు నిలబడ లేదు.. నిలబడినా ఆయాసం వంటివి వస్తాయట. అలాగే కూర్చున్నా కూడా విపరీతమైన నొప్పి వస్తోందట. దీంతో కల్పిక సర్జరీ చేయించుకున్నట్టు తెలిపింది. ఆ సర్జెరీ పేరు లుంబార్ రాడిక్యులోపతి. ఇదే కల్పికకి చేయడం జరిగింది. ‘చివరికి అంతా సవ్యంగా జరిగింది.. నా పోరాటం చివరికి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి’ అంటూ కల్పిక ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus