‘ప్రయాణం’ చిత్రంతో నటిగా పరిచయమై.. ఆ చిత్రంలో కీలక పాత్రని పోషించి తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది కల్పిక గణేష్. ఆ చిత్రంలో హీరోయిన్ కంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తరువాత ‘ఓం శాంతి’ ‘నమో వెంకటేశ’ ‘ఆరెంజ్’ ‘నిప్పు’ ‘జులాయి’ ‘సారొచ్చారు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ తెలుగమ్మాయి. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ఈమె నటన అందరినీ ఆకట్టుకుంది.
హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్. ఇక ఈ బ్యూటీ పెద్ద నటి అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కు కూడా ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఇక గత కొంత కాలం నుండీ.. తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే కల్పిక.. ఇప్పుడు ఎన్నో వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.