ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి..!

అనేక సూప‌ర్ హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించి, తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న న‌టి క‌ల్యాణి తాజాగా ద‌ర్శ‌క నిర్మాత‌గా మారారు. ఇటీవ‌లి కాలంలో అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తూ వ‌స్తున్న ఆమె కే2కే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా క‌ల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా త‌యార‌వుతోంది. ఈ సినిమా ప్రి లుక్‌, టీజ‌ర్ గ్లింప్స్‌ను హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా సోమ‌వారం డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించారు.

చేత‌న్ శీను, సిద్ది, సుహాసినీ మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి, శ్వేత ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానున్న‌ది. బాల‌న‌టిగా కెరీర్ ఆరంభించిన క‌ల్యాణి, 1986 నుంచి సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. త‌న‌కున్న విస్తృతానుభ‌వంతో ఒక‌వైపు నిర్మాత‌గా మారుతూనే మ‌రోవైపు ద‌ర్శ‌క‌త్వాన్నీ చేప‌ట్టారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus