సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి కస్తూరి Kasthuri Shankar) ఇప్పుడు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్‌గా ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో నివసిస్తున్న తెలుగు వారికి ఆగ్రహం తెప్పించాయి. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చివరికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఆ వివాదంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబం, కెరీర్ పట్ల చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన కస్తూరి అద్భుత నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Kasthuri Shankar
ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. సినిమా రంగంలోకి రావడానికి ధనుష్ (Dhanush) తండ్రి కస్తూరి రాజా పాత్ర కీలకమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 1990లలో సౌత్ సినీ పరిశ్రమలో తారలుగా వెలిగిన కస్తూరి ‘మిస్ చెన్నై’, ‘మిస్ మద్రాస్’ టైటిల్స్ గెలుచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, కస్తూరి పేద కుటుంబానికి చెందినదని అనుకోవడం తప్పు.
మొదట్లోనే ఆమె కోట్ల అస్త కలిగిన అమ్మాయి. అసలు విషయం ఏమిటంటే, ఆమె ధనిక కుటుంబంలో పుట్టి పెరిగింది. సినిమాల్లో వచ్చిన ప్రతిపాదనలను ఆమె పూర్తిగా తన ప్యాషన్ కోసమే అంగీకరించింది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పుడే ఆమె డాక్టర్ రవికుమార్‌ని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా తన నటనను కొనసాగించడమే కాకుండా బుల్లితెర మీద కూడా ఆమె మెప్పించింది.
ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల వల్ల తాను అనవసరమైన చిక్కుల్లో పడినా, ఆమె స్వభావం మాత్రం ఎప్పుడు ప్రశ్నలు లేవనెత్తడమే. ఆ పౌరసత్వ హక్కులపై స్పష్టమైన అభిప్రాయాలను పంచుకుంటూ, తన మాటల ద్వారా చాలా సమస్యలకు వెలుగు చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందిగా మారాయి. మరి, ఈ వివాదాలు ఆమె కెరీర్‌పై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.