Kasturi: అనసూయ ఆంటీ వివాదంపై స్పందించిన కస్తూరి.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్నా వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఆంటీ అనే కామెంట్లకు సంబంధించిన వివాదం ద్వారా అనసూయ గతంలో వార్తల్లో నిలవగా ఈ వివాదం విషయంలో కొంతమంది అనసూయకు సపోర్ట్ చేస్తే మరి కొందరు అనసూయపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఈ వివాదం విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారతీయుడు, అన్నమయ్య సినిమాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న కస్తూరి శంకర్ ప్రస్తుతం బుల్లితెర సీరియళ్లతో బిజీగా ఉన్నారు.

కస్తూరి నటిస్తున్న సీరియళ్లు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఆంటీ వివాదం గురించి కస్తూరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న పాప ఆంటీ అని పిలవడానికి దున్నపోతులా ఉండే వ్యక్తి ఆంటీ అని పిలవడానికి డిఫరెన్స్ చాలా ఉందని కస్తూరి అన్నారు. చిన్న పిల్లలు మాత్రమే ఆంటీ అని పిలవవచ్చని అడల్ట్ అయితే ఆంటీ అని పిలవడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

హీరోను, నటుడిని అంకుల్ అని పిలుస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు. అనసూయ కంటే రెట్టింపు ఏజ్ ఉన్న హీరోలను అంకుల్ అని చూడండి అంటూ కస్తూరి కామెంట్ చేశారు. ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ కూడా ఉందని కస్తూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వివాదం విషయంలో అనసూయకు నా సపోర్ట్ ఉంటుందని కస్తూరి చెప్పుకొచ్చారు.

ఇతరులపై గౌరవం లేకపోయినా లేదా మనసులో చెడు ఆలోచనలు ఉంటే మాత్రమే ఆంటీ అని పిలవడం జరుగుతుందని కస్తూరి శంకర్ అభిప్రాయపడ్డారు. కస్తూరి కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus