Kavya Sree: సింపతీ కార్డు ప్లే చేస్తున్న నిఖిల్..హాట్ టాపిక్ అయిన కావ్య శ్రీ ఇన్స్టా పోస్ట్

బిగ్బాస్లో లవ్ ట్రాక్..లు అనేవి సర్వసాధారణమైన వ్యవహారంగా మారిపోయింది. ఒకరితో ఇంకొకరు సంబంధం లేకుండా హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ గా మారడం.. వాళ్ళ ఇంటరాక్షన్ ను బిగ్ బాస్ హైలెట్ చేసి లవర్స్ గా ప్రొజెక్ట్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం.చివరికి అంటే వాళ్ళు హౌస్ నుండి బయటకు వచ్చాక సెపరేట్ అవ్వడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక సీజన్ 8 లో నిఖిల్ (Nikhil), సోనియా..ల మధ్య లవ్ ట్రాక్ నడిచిన సంగతి తెలిసిందే.

Kavya Sree

బయటకు వెళ్ళాక వీళ్ళ లవ్ జర్నీ కంటిన్యూ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ సోనియా ఎలిమినేట్ అవ్వడం.. ఆ తర్వాత నిఖిల్.. యష్మీతో  (Yashmi Gowda)  ప్రేమలో ఉన్నట్లు చూపించడం జరిగింది. అయితే మరోపక్క నిఖిల్.. ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటే.. కావ్య శ్రీని ఉద్దేశిస్తూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే నిన్నే మొదట మీట్ అవుతా.! నువ్వు , తిట్టినా, కొట్టినా పడతా..! అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

ఇవి కావ్య శ్రీని (Kavya Sree) ఉద్దేశించి నిఖిల్ చేసిన కామెంట్లు అనుకోవాలి. కానీ అతను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు హోస్ట్ నాగార్జునతో తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు కావ్య శ్రీని ఉద్దేశించి అతను ఎమోషనల్ కామెంట్స్ చేయడంతో ‘నిఖిల్ సింపతి కార్డ్ వాడుతున్నాడు’ అంటూ సెటైర్లు కురుస్తున్నాయి. దీంతో కావ్య శ్రీ కూడా నిఖిల్ పై ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘ముసుగు మనుషులను నమ్మకండి.

వాళ్ళ అసలు రూపం ఆ మాస్క్ తీసినప్పుడు బయటపడుతుంది’ అంటూ ఆమె ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. నిఖిల్ తో పాటు కావ్య గతంలో పలు షోలకి వెళ్లడం, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం జరిగింది. కానీ తర్వాత మనస్పర్థలు రావడంతో సెపరేట్ అయిపోయినట్టు స్పష్టమవుతుంది. కావ్య (Kavya Sree) తన ఫాలోవర్స్ నిఖిల్ కి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో అతను సింపతీ కార్డు వాడుతున్నాడేమో అని అంతా అభిప్రాయపడుతున్నారు.

ఇంతమంది దర్శకులు ఒక్క ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఇదే మొదటిసారేమో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus