Keerthy Suresh: ‘బంగారు’ మనసు చాటుకున్న కీర్తి సురేష్.. ఏకంగా రూ.13 లక్షలు ఖర్చు చేసి మరీ!

మొన్నామధ్య ‘పుష్ప’ సినిమా యూనిట్ మెంబర్స్ కు గోల్డ్ కాయిన్స్ ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప ది రైజ్’ చిత్రం కోవిడ్ టైంలో కూడా అంత ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడానికి ముఖ్య కారణం టెక్నికల్ టీం అలాగే యూనిట్ మెంబర్స్ అని భావించి బన్నీ అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి గాను రాంచరణ్ కూడా యూనిట్ మెంబర్స్ కు గోల్డ్ కాయిన్స్ అందజేశాడు. ఒక పెద్ద సినిమాకి యూనిట్ మెంబర్స్ కష్టం చాలా ఉంటుంది.

తెరపై విజువల్స్ అంత బాగా వస్తున్నాయి అంటే వెనుక వీళ్ళ కష్టం చాలా ఉంటుంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా వీళ్ళకు పేరు రాదు. కానీ వీళ్ళ కష్టాన్ని దగ్గరుండి చూసిన నటీనటులు ఇలా స్పందించడం అంటే గొప్ప విషయం అంటే చెప్పాలి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కీర్తి సురేష్ కూడా చేరింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ‘దసరా’ షూటింగ్ ఈ మధ్యనే కంప్లీట్ అయ్యింది. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాని హీరోగా నటిస్తున్నాడు.

గతంలో నాని- కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన ‘నేను లోకల్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి.. ‘దసరా’ పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. పైగా ఇది నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా..! శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా..

‘దసరా’ షూటింగ్ చివరి రోజున యూనిట్ మెంబర్స్ కు గోల్డ్ కాయిన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది హీరోయిన్ కీర్తి సురేష్. సినిమా కోసం పనిచేసిన 130 మంది స్టాఫ్ కు ఒక్కొక్కరికీ 2 గ్రాముల బంగారు నాణాలను ఈమె పంచింది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.13 లక్షలు ఖర్చు చేసిందట. దీంతో కీర్తి సురేష్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus