Kiara Advani: పెళ్లి తర్వాత అలాంటి పోస్ట్ చేసిన కీయారా ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!

ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈమె బాలీవుడ్, తెలుగు సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అనంతరం ఈమె తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించారు.

ఇలా రెండవ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమ గురించి పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ వీరు ప్రేమ వార్తలను ఖండించారు. ఈ విధంగా రహస్యంగా ప్రేమ ప్రయాణం చేసినటువంటి ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీ తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు

పలుకుతూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలా వీరి వివాహం రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకుని ఒకటైన ఈ జంట హనీమూన్ ట్రిప్ కూడా పూర్తి చేసుకుని వచ్చారు. ఇలా పెళ్లి సమయంలో హడావిడిగా ఉండటంవల్ల కియరా పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో ఇప్పుడు తన పెళ్లికి సంబంధించిన సంగీత్, హల్ది వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమ్ థింగ్ ఎబౌట్ దట్ నైట్.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్’ అని క్యాప్షన్ పెట్టింది. దీనికి ఫన్నీగా రియాక్ట్ అయిన పలువురు నెటిజన్స్.. ఫస్ట్ నైట్ హా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus