Kriti Sanon: పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ హీరోయిన్!

తెలుగు చిత్ర పరిశ్రమకు మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు నటి కృతి సనన్ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఈమె నాగచైతన్యతో మరొక సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ కావడంతో ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక చాలా రోజుల తర్వాత ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తో ఈమె ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇలా ఈ వార్తలతో ఈమె పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో కూడా నిలిచారు.

ఇక ఎప్పటికప్పుడు ప్రభాస్ తనుకు కేవలం మంచి ఫ్రెండ్ అని పెళ్లి వార్తలను ఖండిస్తున్నప్పటికీ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి కృతి సనన్ పెళ్లిళ్ల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పనిచేసే వారికి పెళ్లిళ్లు తొందరగా కావనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉందని తెలిపారు.

వాస్తవానికి చాలామంది హీరోయిన్స్ ను పెళ్లి తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే నటన అనేది వారి వృత్తిపరమైన జీవితంలో ఒక భాగం అని ఇప్పటికీ అంగీకరించకపోవడం వల్లే హీరోయిన్స్ ను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. అయితే తాను కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో తన స్నేహితులకు కొందరు తనని ఇదేవిధంగానే భయపెట్టారని ఈమె అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ఇలా తన స్నేహితులు తనని భయపెట్టినప్పటికీ తాను మాత్రం ఆ మాటలను గుర్తించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనను తాను నిరూపించుకున్నానని ఈమె తెలియజేశారు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం తన కెరియర్ పైనే దృష్టి పెట్టానని అదే ఈ స్థాయిలో నన్ను నిలబెట్టిందనీ, ప్రస్తుతం నేను కోరుకున్న కెరియర్ లో నేను రాణిస్తున్నానని ఈ సందర్భంగా కృతి సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus