మహిళల గౌరవాన్ని కాపాడడానికి పోరాడతా!
- October 27, 2020 / 01:07 PM ISTByFilmy Focus
సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీసీకే అధినేత తిరుమావళవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఖుష్బూ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం నాడు నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిరసనకు పోలీసుల నుండి అనుమతి రాలేదు.
అయినప్పటికీ ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న కుష్బూను ఈసీఆర్ రోడ్డులో అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో గౌండంబాడిలో వీసీకే, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగితే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. తిరుమావళవన్ ఇటీవల యూట్యూబ్ ఛానెల్ లో మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కుష్బూ ఆరోపించారు.

ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!













