లైంగిక వేధింపులు అంటే ఒకప్పుడు బయట ప్రాంతాల్లోనే జరిగేవి అనుకునేవారు. ఎందుకంటే ఇళ్లలో జరిగే లైంగిక వేధింపులు గురించి ఎవరూ బయటకు చెప్పేవారు కాదు. చెబితే ఏమంటారో అనే భయంతో ఆగిపోయేవారు. అలాగే చెప్పినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఏదో ఆడపిల్లకు తెలియక అంటోందిలే అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఇళ్లలో, బంధువుల వల్ల జరిగే లైంగిక వేధింపులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సినిమా తారల తొలుత ఈ విషయాలు చెప్పడం ప్రారంభించిన తర్వాత..
సగటు మహిళలు, అమ్మాయిలు ఈ విషయాల్ని చెబుతున్నారు. తాజాగానీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించారని చెప్పారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని కూడా చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక అబ్బాయి లేదా అమ్మాయి చిన్నతనంలో వేధింపులకు గురైతే అది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది.
నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది అంటూ నాటి విషయాలను చెప్పుకొచ్చారు. తన భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మ హక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది అంటూ తన తండ్రి గురించి చెప్పాడు. నా ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. అప్పుడు ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని భయపడ్డాను.
ఎందుకంటే ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం మా అమ్మది. అయితే 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం ప్రారంభించాను. దీంతో నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మా కుటుంబాన్ని వదిలివెళ్లిపోయాడు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం అంటూ నాటి విషయాల్ని ఖుష్బూ వివరించారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!