Actress Laila: కార్తీ ‘సర్దార్’ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరోయిన్ లైలా..!

ఒకప్పటి హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. ఓ టైములో తమ గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు తర్వాత పలు కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమవ్వడం.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరుగుతూనే ఉంది. ఈ లిస్ట్ లో ఒకప్పటి హీరోయిన్ లైలా కూడా ఉంది. ఈమె తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎగిరే పావురమా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లైలా మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Click Here To Watch NOW

ఆ చిత్రంలో ఈమె అల్లరి పిల్లగా.. ప్రేమించిన అబ్బాయి కోసం తన పై ఆశలు పెట్టుకున్న మావయ్యకి చెప్పలేక ఇబ్బంది పడే అమ్మాయిగా ఈమె మంచి నటన కనపరిచింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి. వెంకటేష్ తో ‘పెళ్ళి చేసుకుందాం’, బాలకృష్ణతో ‘పవిత్ర ప్రేమ’, వడ్డే నవీన్ తో ‘లవ్ స్టోరీ 1999’, వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ఆ తర్వాత ‘నువ్వే కావాలి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో, మిస్టర్ అండ్ మిసెస్ ‘శైలజా కృష్ణమూర్తి’ అనే సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించింది కానీ తెలుగులో చేయలేదు. 2006 లో ఓ మెహ్దీ అనే ఇరానీ బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్పింది. ఈమె తమిళంలో నటించిన ఆఖరి చిత్రం ‘తిరుపతి’. ఈ మూవీ అదే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్తుతం కార్తీ నటిస్తున్న ‘సర్ధార్’ అనే మూవీలో లైలా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందట. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కానుంది.

‘అభిమన్యుడు’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన పి.ఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. మొదట లైలా ప్లేస్ లో సిమ్రాన్ ను అనుకున్నారట. కానీ ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దర్శకనిర్మాతలు లైలాని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus