Actress Laya: ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న నటి లయ.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

తెలుగమ్మాయి లయ గుర్తుందా?.. ‘స్వయంవరం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, మంచి మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించడే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ’ప్రేమించు‘ మూవీలో బ్లైండ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించి నంది అవార్డ్ అందుకుంది. తర్వాత జగపతి బాబుతో చేసిన ‘మనోహరం’ కూడా నందినందుకుంది. హీరోయిన్‌గా మంచి పొజిషన్లో ఉండగానే అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ శ్రీ గణేష్‌ను పెళ్లి చేసుకుంది విజయవాడ అమ్మాయి లయ.

పెళ్లి తర్వాత భర్తతో పాటు అక్కడే స్థిర పడిపోయింది. వీరికి ఓ పాప, బాబు సంతానం. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తనలానే పిల్లలిద్దర్నీ బాలనటులుగా పరిచయం చేస్తూ.. తను కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన లయ.. అమెరికాలో సెటిల్ అయినా కానీ మన ట్రెడిషన్‌ని మర్చిపోలేదు. భర్త, పిల్లలతో కలిసి దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus