Laya Father: లయ గురించి ఆమె తండ్రి అలా కామెంట్లు చేశారా?

సినిమా ఇండస్ట్రీలో సరిగ్గా రెమ్యునరేషన్లను చెల్లించే నిర్మాతల సంఖ్య తక్కువగా ఉంటుంది. వేర్వేరు కారణాలు చెప్పి నటీనటులకు, టెక్నీషియన్లకు పారితోషికాలు ఎగ్గొట్టే నిర్మాతలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రముఖ నిర్మాతలు మినహా మిగతా నిర్మాతలలో చాలామంది ఇదే విధంగా వ్యవహరిస్తారు. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన లయ ఒక సినిమా విషయంలో నాకు కూడా పారితోషికం విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు.

ఒక సినిమా విషయంలో అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తున్నారని నాకు మాత్రం ఇవ్వట్లేదని నా విషయంలో అలా చేయడంతో ఊరుకోకూడదని డిసైడ్ అయ్యానని ఆమె కామెంట్లు చేశారు. ఒకరోజు డబ్బులు ఇస్తేనే షూటింగ్ కు వెళ్లాలని లేకపోతే వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని లయ తెలిపారు. నేను షూటింగ్ కు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యి ఇంట్లోనే ఉండిపొయానని ఆమె వెల్లడించారు.

మా నాన్నగారు రోజూ ఉదయం, రాత్రి ఊళ్లో లేకపోతే మా అమ్మకు ఫోన్ చేస్తారని అమ్మ నేను షూటింగ్ కు వెళ్లలేదని చెప్పిందని లయ చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ వల్ల నేను షూట్ కు వెళ్లలేదని తెలిసి నాన్న నాపై కోప్పడ్డారని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ కూతురివి.. నీకేంటి డబ్బులు కావాలా.. డబ్బుల కోసం వచ్చామా మనం అని నాన్న అన్నారని లయ కామెంట్లు చేశారు. నా కూతురు ఇలా చేస్తుందని అనుకోలేదని నాన్న అన్నారని లయ పేర్కొన్నారు.

ముందు షూటింగ్ కు వెళ్లు.. డబ్బులు లేకపోతే మనం ఇప్పుడు అడుక్కుతింటున్నామా అని నాన్న అన్నారని లయ చెప్పుకొచ్చారు. సినిమాపై చాలామంది డిపెండ్ అయ్యారని వర్క్ ఆపడం కరెక్ట్ కాదని ఆయన భావించారని లయ తెలిపారు. ఆ తర్వాత రెమ్యునరేషన్ ను పట్టించుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. డబ్బులు ఉన్నా ఇవ్వకపోతే బాధేస్తుందని నాన్న కలకత్తాలో నెఫ్రాలజిస్ట్ గా పని చేస్తున్నారని లయ వెల్లడించడం గమనార్హం. చిరంజీవి గారు నాకు డబ్బులు చేసినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆమె తెలిపారు. చిరంజీవి గారి సినిమాలో నాకు ఛాన్స్ రాలేదని లయ చెప్పుకొచ్చారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags