రకుల్ ప్రీత్ సింగ్ మాటలను ఖండించిన మాధవీలత

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గళం ప్రపంచం వినే అవకాశం దొరికింది. అందులో అనేక సమస్యలు బయటికి వచ్చాయి.. చర్చలను లేవనెత్తాయి.. అటువంటి వాటిలో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. హాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను క్యాస్టింగ్ కౌచ్ ఉందని మాధవి లతా, శ్రీ రెడ్డి తదితరులు మీడియాలో చెప్పారు. దీనిపై టాలీవుడ్ లో చర్చ సాగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా ఓ న్యూస్ ఛానల్ లో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా కొంత మంది నటీనటులు నిన్న మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేసి అతని మాటలను ఖండించారు. ఆ మీటింగ్ లో రకుల్ మాట్లాడుతూ.. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనేదే లేదని చెప్పింది. ఐదేళ్లుగా నాకు ఆ అనుభవం ఎదురుకాలేదని వెల్లడించింది. ఆమె మాటలను మాధవి లతా తప్పు పట్టింది.

రకుల్ చెప్పిందంతా అబద్ధమని విరుచుకుపడింది. “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. హాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చి మీటూ క్యాంపైయిన్ ఏర్పాటు చేశారు. తెలుగులో మాత్రం ఎవరు సపోర్ట్ చేయటానికి ముందుకు రారు. ప్రతి చోట ఇది ఉంది. మరి జనాలను పిచ్చోళ్ళని చేసేలా రకుల్ మాట్లాడటం కరెక్ట్ కాదు” అని సోషల్ మీడియాలో వీడియో ద్వారా మాధవి లతా స్పష్టం చేసింది. మరి వీరిద్దరి మధ్య గొడవ ఎంతదూరం వెళుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus