రాకేష్ మాష్టర్ ను విడిచిపెట్టేదే లేదంటున్న మాధవీలత..!

  • May 28, 2020 / 07:48 PM IST

ఈ మధ్యకాలంలో కొందరు క్రేజ్ కోసం.. అలాగే పబ్లిక్ అటెన్షన్ కోసం సోషల్ మీడియాను వాడుకోవడం బాగా అలవాటు చేసుకున్నారు కొందరు ఫామ్లో లేని సెలబ్రిటీలు. ఈ లిస్ట్ లో శ్రీ రెడ్డితో పాటు పూనమ్ కౌర్ వంటి వారిని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో రాకేష్ మాష్టర్ కూడా చేరాడు. ఈయన కొంత మంది సెలబ్రిటీలను నోటికి వచ్చిన తిట్లు అన్నీ తిడుతూ.. అలాగే అసభ్యకరమైన పదజాలాలను కూడా వాడుతూ విమర్శిస్తున్నాడు.

మొన్నటికి మొన్న ‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్ హైపర్ ఆది ని కూడా రకరకాల తిట్లు తిట్టిన ఈయన.. ఇప్పుడు మాధవీలత ను కూడా టార్గెట్ చేసి.. ‘జప్ఫాదాన’ ‘అత్తాపూర్’ ‘బుడబుక్కలదాన’ ‘ముదనష్టపుదాన’ అంటూ ఇంకా ఎన్నో అసభ్యకరమైన పదజాలంతో ఆమెను విమర్శించాడు. దీంతో ఈ కామెంట్స్ పై మాధవీలత ఫైర్ అయ్యింది. ఏకంగా రాకేష్ మాష్టర్ కు లీగల్ నోటీసులు పంపింది. ఆమె మాట్లాడుతూ.. “రాకేష్ మాష్టర్ ఎవరో నాకు తెలీదు. కానీ అతని కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి. ఏ పబ్లిక్ మీడియాలో అయితే నాపై అసభ్యకరమైన కామెంట్స్ చేసాడో .. అక్కడే నాకు క్షమాపణలు చెప్పాలి..

లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. పోలీస్ స్టేషన్కు రప్పిస్తా.. కోర్టు మెట్లు ఎక్కిస్తా.ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపాను. అడ్వకేట్ మన్నవ్ కుమార్ సహాయంతో ఈ నోటీసును రాకేష్ మాష్టర్ కు పంపాను” అంటూ మాధవీ లత చెప్పుకొచ్చింది. రాకేష్ మాష్టర్… మాధవీ లత పై చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus