హీరోయిన్ మాలాశ్రీ కూతురు.. ఎంత గ్లామర్ గా ఉందో చూడండి..!

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మాలాశ్రీ. తన గ్లామర్ తో నటనతో ఓ ఊపు ఊపేసింది. ‘ప్రేమఖైదీ’, ‘ఘరానా అల్లుడు’, ‘బావ బావమరిది’, ‘తోడి కోడళ్లు’ వంటి చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఇక్కడ ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ఈమె నటించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మాలాశ్రీ తన కూతుర్ని కూడా హీరోయిన్ గా పరిచయం చేయబోతుంది.

ఆమె పేరు రాధనా రామ్. కన్నడ స్టార్ హీరో దర్శన్‌తో కలిసి ‘D56′( వర్కింగ్ టైటిల్‌) టైటిల్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీతో ఈమె ఎంట్రీ ఇవ్వబోతోంది. బెంగళూరులో ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ‘నా కూతురు రాధనాకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాత. అతను నా చిత్రంతోనే ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు నా కూతురు అతని నిర్మాణంలో తెరంగేట్రం చేస్తుంది.

మంచి టీమ్‌తో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ కోసం శిక్షణ తీసుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ మాలాశ్రీ తన కూతురికి బెస్ట్ విషెస్ తెలిపింది.

ఇక ‘D56’ మూవీ సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే మాలాశ్రీ కూతురు హీరోయిన్ గా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఆమె లుక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus