సాహో సినిమా అనంతరం పాన్ ఇండియా నటిగా గా ప్రేక్షకుల బాగా దగ్గరైన మందిరా భేడి ఇంట్లో విషధ ఛాయలు అలుముకున్నాయి. ఆమె భర్త కన్నుమూయడం సినీ పెద్దలను షాక్ కు గురి చేసింది. ఉదయాన్నే వార్తలు రావడంతో అది నిజమని అనుకోలేదు. కానీ కొద్దిసేపటి అనంతరం కుటుంబ సభ్యులు స్పందించడంతో అందరూ షాక్ అయ్యారు.బాలీవుడ్ చిత్రనిర్మాతగానే కాకుండా నటి మందిరా బేడి భర్త రాజ్ కౌషల్ దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఇక మరణం వార్తతో హిందీ నటీనటులు మనోవేదనకు గురవుతున్నారు. 50 ఏళ్ల వయసున్న రాజ్ గతంలోనే కొన్ని అనారోగ్య సమస్యలను దాటి వచ్చేశాడు. ఇక బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు హఠాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారట. ముంబైలోని తన నివాసంలోనే హార్ట్ ఎటాక్ రావడం వలన కన్నుమూశారని మీడియాకి సమాచారం అందింది. ఇక కుటుంబ సభ్యులు అంత్యక్రియలను బాంద్రాలోనే పూర్తి చేశారు. మందిరా బేడీ, రాజ్ ను 1999లో వివాహం చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు వీర్ – కుమార్తె తారా ఉన్నారు. కరోనావైరస్ వేవ్ లోనే తారాను వారు దత్తత తీసుకున్నారు. ఇక ‘షాదీ కా లడ్డూ’ – ‘ప్యార్ మెయిన్ కబీ కబీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కౌషల్ బాలీవుడ్ బెస్ట్ సినిమాల్లో ఒకటైన మై బ్రదర్ నిఖిల్ ను కూడా నిర్మించాడు.