Meena, Roja: సినిమాల విషయంలో రోజా అలా చేసేవారు: మీనా

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సీనియర్ నటి మీనా ఒకరు. ఈమె బాలనటిగా తన కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్గా కొనసాగుతూ ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. ఇలా ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది

వివాహం జరిగిన తర్వాత తనకు కుమార్తె పుట్టడంతో ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది అయితే తన కుమార్తె కాస్త పెరిగి పెద్దవ్వడంతో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ బిజీగా ఉన్న సమయంలోనే తన భర్త మరణం తనని ఎంతగానో కృంగదీసింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మీనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ భాగంగా తనతో పాటు నటించినటువంటి హీరోయిన్స్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అప్పట్లో హీరోయిన్ పాత్రలకు చాలా మంచి ప్రాధాన్యత ఉండేది కొంతమంది రచయితలు నన్ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాయడం నిజంగానే అదృష్టమని తెలిపారు. ఇక అప్పట్లో కూడా గ్లామర్ షో చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఆసక్తి చూపేవారు నాకి కూడా చాలా ఆసక్తి ఉండేదని అయితే నేను పరిమితి దాటి గ్లామర్ షో చేయలేదని ఈమె తెలియజేశారు.

ఇక నేను హీరోయిన్ గా కొనసాగే సమయంలోనే రంభ రమ్యకృష్ణ రోజా వంటి వారందరూ కూడా ఇండస్ట్రీలో నాకు మంచి స్నేహితులుగా ఉన్నారని వాళ్ళతో స్నేహం నా అదృష్టంగా భావిస్తున్నానని ఈమె తెలియజేశారు. అప్పట్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన నాకు ఎవరితో పోటీ లేదు కానీ రోజాతో మాత్రమే నాకు పోటీ ఉండేదని ఇద్దరం సినిమాల పరంగా బిజీగా ఉండే వాళ్ళమని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల తాను కమిట్ అయిన సినిమాలు నేను, నేను కమిట్ అయిన సినిమాలు కొన్నిసార్లు ఆమె నటించిన సందర్భాలు కూడా ఉన్నాయని (Meena) మీనా తెలిపారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus