Meena: సీనియర్ నటి మీనా తల్లి కాబోతుందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి మీనా. అప్పటి స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించింది. హోమ్లీ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను దగ్గరైన ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాల్లో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత వైద్యరంగంలో రాణిస్తున్న సాగర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది.

Click Here To Watch NOW

పెళ్లి తరువాత సినిమాల్లో నటించడం తగ్గించింది మీనా. కానీ రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తల్లి, వదిన, చెల్లి పాత్రల్లో నటిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో మీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గాఉంటుంది . ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంది . తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఒకప్పుడు ఈ గెటప్(ప్రెగ్నెంట్) వేసుకోవడం చాలా ఈజీగా ఉండేదని.. ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పింది. అప్పట్లో కవర్ చేసుకోవడానికి హెవీ చీరలను ధరించేవాళ్లమని కానీ ఇప్పుడు లుక్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని.. నేచురల్ గా కనిపించడానికి షిఫాన్ చీరలను కూడా ధరించవచ్చు అంటూ వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోను బట్టి మీనా తన తదుపరి సినిమాలో గర్భవతిగా కనిపించబోతుందని తెలుస్తోంది. అయితే కొందరు అభిమానులు మాత్రం ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె తదుపరి సినిమా హిట్ అవ్వాలంటూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. నటి మీనాకు నైనిక అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లిలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags