Meena: పెళ్లి చేసుకోమన్న స్నేహితులు… మీనా రియాక్షన్ ఏంటో తెలుసా?

ప్రముఖ సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ గత ఏడాది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా మీనా భర్త విద్యాసాగర్ మరణించడంతో ఈమె ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మీనా ఇప్పుడిప్పుడే ఈ విషయాలన్నింటినీ మరిచిపోయి తిరిగి తన సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ విధంగా మీనా ప్రస్తుతం సినిమాల పరంగా బిజీ అవుతున్నారు. అయితే మీనా భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోబోతుంది.

అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు వచ్చాయి ఈ వార్తలను మీనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. ఇక మీనా కూతురు సైతం ఇలాంటి వార్తలు వల్ల తన తల్లి చాలా బాధపడుతుంది అంటూ ఓ సినిమా వేడుకలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విధంగా మీనా రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి ఖండిస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా మీనా ప్రాణ స్నేహితురాలు ఫ్యామిలీ ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ కాలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను మీనాకు (Meena)  చాలా ప్రాణ స్నేహితురాలు ప్రాణ స్నేహితురాలు అనడం కన్నా సొంత అక్క చెల్లెలు ఉంటాము అంటే బాగుంటుందని ఈమె తెలిపారు. మీనాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే నేను అక్కడ వాలిపోతాను తన భర్త విద్యాసాగర్ అనారోగ్యానికి గురైన మూడు నెలల పాటు నేను తన వద్ద ఉన్నానని తెలియజేశారు. ఇక జీవితంలో జరగకూడనటువంటి విషాదం మీనా జీవితంలో జరిగిందని తన భర్త చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడటానికి మీనాకు చాలా సమయం పట్టిందని తెలిపారు.

అయితే ఒకానొక సమయంలో తనని రెండో పెళ్లి చేసుకోమంటూ నేను సలహా ఇచ్చాను దాంతో ఒక్కసారిగా నాపై కోప్పడింది. ఇది నా జీవితం ఒకవేళ నాకు ఇలాంటి సలహాలు ఇవ్వాలి అనుకుంటే నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇకపై ఎప్పటికీ ఇక్కడికి రాకు నాకు ఒక కూతురు ఉంది తన భవిష్యత్తును నేను తీర్చిదిద్దాలి అంటూ కోప్పడిందని ఈ సందర్భంగా కాలా రెండో పెళ్లి గురించి మీనా అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags