కొన్ని సినిమాల కోసం పడ్డ కష్టం చెబితే వినేవారికి, చెప్పేవారికి చాలా ఆనందంగా ఉంటుంది. ఓ సినిమా కోసం ఇంత కష్టపడ్డారా అని మనం అనుకుంటే.. తమ కష్టం చెప్పి సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం వారికి ఆనందంగా ఉంటుంది. సినిమా విడుదలయ్యాక ఆ ఆనందం డబుల్ అవుతుంది. అయితే సరైన ఫలితం వచ్చినప్పుడు మాత్రమే. తాజాగా అలాంటి ఆనందాన్ని పొందుతున్న టీమ్ ‘ఉగ్రం’. అల్లరి నరేశ్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్ మిర్నా మేనన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
‘ఉగ్రం’ సినిమా కోసం 75రోజులు పని చేశారట. అయితే అందులో 55 రోజులు నైట్ షూట్లేనట. ఒకానొక సందర్భంలో 48 గంటలు బ్రేక్‌లు లేకుండా షూటింగ్‌లు చేశారట. భారీ వర్షం, హైవేపై దుమ్ములో కూడా చిత్రీకరణ జరిపాం అని మిర్నా వివరించింది. ఈ క్రమంలో కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశామని తెలిపింది. సినిమా ట్రైలర్‌లో చూపించిన కారు ప్రమాదం రియల్ స్టంట్ అని చెప్పింది. అంతేకాదు ఆ సీన్స్ చేస్తున్నప్పుడు నరేష్ గాయపడ్డారట. ఆమె కూడా కింద పడిపోయి కాస్త గాయపడిందట.
ఆ కారు సీన్ షూట్ నేను కూడ స్వల్పంగా గాయపడ్డా… అక్కడక్కడా కొట్టుకుపోయి దెబ్బలు తగిలాయి. అయితే ఆ ఎపిసోడ్ నాకు మంచి అనుభవంగా మిగిలిపోయింది అని చెప్పింది మిర్నా. ‘‘నేను కేవలం కమర్షియల్ హీరోయిన్‌గానే ఉండాలనుకోవడం లేదు. నటిగా మంచి పేరు తెచ్చే పాత్రలు చేయాలనుంది’’ అందుకే అలాంటి రిస్క్ సీన్స్ కూడా చేసి శభాష్ అనిపించుకోవాలని నా ఆలోచన అని చెప్పింది.
‘క్రేజీ ఫెలో’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన (Mirnaa) మిర్నా మేనన్‌కు ‘ఉగ్రం2 రెండో సినిమా. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది. ‘‘కెరీర్ ఆరంభంలోనే రజనీకాంత్, మోహన్‌లాల్ లాంటి స్టార్లతో పని చేసే అవకాశం రావడం అదృష్టం. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ పనిచేయడం మర్చిపోలేని అనుభూతి’’ అని ఆనందపడిపోయింది మిర్నా. ఇంకా తమిళంలో వెట్రిమారన్ కథతో ఆమిర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?