Natanya Singh: గుడుంబా శంకర్ లో ఐటమ్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమాలలో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలను ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ ని బట్టి ఆ సినిమాలు ఫ్లాప్స్ అయ్యుండొచ్చు కానీ, ఇప్పటి ఆడియన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ కొన్ని ఫ్లాప్ మూవీస్ ని టీవీ టెలికాస్ట్ అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సినిమాలలో ఒకటి ‘గుడుంబా శంకర్’.

ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమాని చూస్తూ మంచి కాలక్షేపం చెయ్యొచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, ఈ చిత్రం స్క్రీన్ ప్లే కి ఆకర్షితుడై ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ఆ స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతూ ఒక పది సంవత్సరాలు తన కెరీర్ ని లాగించేసాడు. ఇక గుడుంబా శంకర్ కి స్క్రీన్ ప్లే అందించింది పవన్ కల్యాణే.

ఇక ఈ చిత్రం లోని ప్రతీ పాట ఒక ఆణిముత్యం లాగ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రం ఖుషి కంటే కూడా ఈ సినిమాలోని పాటలే పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కిల్లి కిల్లి’ అనే పాట అప్పట్లో మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. ఈ పాట లో పవన్ కళ్యాణ్ తో పాటు చిందులేసిన అమ్మాయి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. ఎవరూ ఈ అమ్మాయి ఇంత క్యూట్ గా ఉంది, మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదే అని అనుకునేవాళ్ళు.

అమె పేరు (Natanya Singh) నతాన్య సింగ్. తెలుగు లో ఈమె పెద్దగా కనిపించలేదు కానీ, కన్నడ లో మాత్రం పెద్ద స్టార్ హీరోయిన్. అక్కడి స్టార్ హీరోలైన ఉపేంద్ర , కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ లాంటి వాళ్ళతో కలిసి నటించింది. 2008 వ సంవత్సరం లో ఉపేంద్ర హీరో గా నటించిన ‘బుద్దివంత’ చిత్రమే ఈమెకి ఆఖరి చిత్రం. ఆ తర్వాత మళ్ళీ ఈమె సినిమాల్లో కనిపించలేదు, అయితే ఈమెకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు క్రింద అందిస్తున్నాము చూడండి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus