మెగాస్టార్ కోసం పూజలు చేస్తున్న నటి నవీనా రెడ్డి

టాలీవుడ్ ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి కి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియడంతో ఆయన అభిమానులు అందరూ మా మెగాస్టార్ త్వరగా క్షేమంగా కోలుకోవాలని ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు. వారిలో ఒక భాగం అయిన ప్రముఖ నటి నవీనా రెడ్డి కూడా దేవాలయంలో మెగాస్టార్ పేరుమీద అర్చనలు జరిపిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడుని వేడుకున్నాను అని తెలిపారు. నవీనా రెడ్డి ఎఫ్ 2, వెంకీ మామ, భీష్మ, ఉప్పెన, వంటి సినిమాలలో నటించారు. నాని నిర్మాత గా విశ్వక్ షేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో లేడి కిల్లర్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం అర్ధ శతాబ్దం, దేవినేని, ప్లాన్ బి వంటి సినిమాలలో కూడా నటిస్తున్న నవీనా రెడ్డి ప్రముఖ కమర్షియల్ కంపెనీ యాడ్స్ లలో సైతం నటించి మోడల్ గా కూడా బాగా గుర్తింపు పొందారు.

అయితే సినిమా ఇండస్ట్రీ లో తనకు రోల్ మోడల్ అయిన మెగాస్టార్ గారు కరోనా బారిన పడటం తనను ఎంతగానో కలచివేసింది అని, ఆయన పూర్తి ఆరోగ్యంగా మన వస్తారనే నమ్మకం తనకు ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నట్టు తెలిపారు నవీనా రెడ్డి. నవీనా రెడ్డితో పాటు యావత్ మెగాస్టార్ అభిమాన సైన్యం అందరూ అయన అతిత్వరగా కోలుకొని మా రావాలి అంటూ ప్రార్ధనలు చేస్తున్న విషయం మనకు తెలిసినదే.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus