స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) చిరుత (Chirutha) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పేరు నేహాశర్మ (Neha Sharma) కాగా తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో నేహా శర్మ పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. నేహాశర్మ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఆమె తండ్రి అజయ్ శర్మ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
ప్రస్తుతం అజయ్ శర్మ బీహార్ రాష్ట్రంలో భాగల్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహాఘట్ బంధన్ సీట్ల పంపకం గురించి చర్చల అనంతరం తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని నేహా శర్మ తండ్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి భాగల్ పూర్ నియోజకవర్గం కావాలని అది మా కంచుకోట అని ఆయన తెలిపారు. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హై కమాండ్ పై ఆధారపడి ఉంటుందని అజయ్ శర్మ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తానని నేను పోటీ చేయని పక్షంలో నా కూతురు నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామని నేహాశర్మ తండ్రి వెల్లడించారు. నేహాశర్మ ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం నెట్టింట ఈ పోటీ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. నేహాశర్మ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.
నేహాశర్మ గతేడాది వరకు సినిమాలలో బిజీగా ఉన్నారు. నేహాశర్మ పాలిటిక్స్ లో బిజీ అయితే మాత్రం సినిమాలకు పూర్తిస్థాయిలో దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పొలిటికల్ ఎంట్రీ గురించి నేహాశర్మ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నేహాశర్మ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. నేహాశర్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.