చెప్పు దెబ్బలు తిన్నా.. ఆ విషయంలో తగ్గలేదంటున్న నటి..!

సినిమా వాళ్ళు అంటే కోట్లకు కోట్లు వెనకేసుకుంటారు అని అంతా అనుకుంటారు.వారిది కలర్ ఫుల్ లైఫ్ అని కూడా అనుకుంటారు.కానీ వారు సినిమాల్లో నటించే స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు. నటించినప్పుడు కూడా వాళ్ళు చేసిన అటెంప్ట్ సక్సెస్ అయితేనే.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. బాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ గా పేరు సంపాదించుకున్న నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మొదట ఐటెం సాంగ్స్ లో నర్తించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది.

ధృవ, మిస్టర్ మజ్ను.. వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్లో పలు మ్యూజిక్ ఆల్బమ్స్లో నర్తిస్తుంది.ఈమె ఈ స్థాయికి రావడానికి చెప్పు దెబ్బలు కూడా భరించాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. “మొరాకో దేశానికి చెందిన నాకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం. మంచి డ్యాన్సర్స్ కావాలని ఎన్నో కలలు కన్నాను. అందుకు నా తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. బుద్ధిగా చదువుకోమని నచ్చజెప్పేవారు.

అయినా కూడా నాకు డ్యాన్స్ చేయడానికి ఆసక్తి ఎక్కువ.కాబట్టి నా తల్లికి తెలియకుండా డ్యాన్స్ నేర్చుకునేదాన్ని. ఓసారి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నా తల్లికి పట్టు పడి చెప్పు దెబ్బలు కూడ తిన్నాను. అయినా కూడా డాన్స్ నేర్చుకోవడం మాత్రం వదల్లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ‘టెంపర్’, ‘బాహుబలి’,’కిక్ 2′ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో బెస్ట్ డాన్సర్ గా రాణిస్తుంది. అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్న నోరా.. అందాల ఆరబోతకు కూడా ఏమాత్రం వెనుకాడదు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus