సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఎగ్జిట్ అవుతూనే ఉంటారు. కొందరు ఒక్క సినిమాతోనే ఎగ్జిట్ అయితే మరికొందరు పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి కనుమరుగవుతుంటారు. అవకాశాలు వచ్చిన పర్సనల్ రీజన్స్ తో వెళ్లిపోతుంటే.. కొందరికి అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో పలు సినిమాలలో నటించి పాపులారిటీ సంపాదించుకున్న పియా బాజ్ పాయ్ అవకాశాలు రాక తెరమరుగైంది.
పియా బాజ్ పాయ్ పేరంటే కొందరికి తెలియకపోవచ్చు కానీ జీవ హీరోగా నటించిన రంగం సినిమాలో అల్లరి పిల్లగా సెకండ్ హీరోయిన్ పాత్ర అనగానే టక్కున గుర్తుకు వస్తుంది. పియా బాజ్ పాయ్ లెజెండ్స్ అమితాబచ్చన్, మహేంద్రసింగ్ ధోనిలాంటి వారితో పలు యాడ్స్ కూడా చేసింది. తాను నటించిన పలు సినిమాల్లో ఎక్కువగా అల్లరిపిల్లగానే చేసినా తర్వాత వెండి తెరపై పెద్దగా కనిపించిన దాఖలాల్లేవు.
దీంతో ఓటీటీపై దృష్టిపెట్టి పలు వెబ్ సిరీసులలో నటిస్తోంది. సోషల్ మీడియాలో పియా బాజ్ పాయ్ యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ అండ్ బోల్డ్ ఫోటోలను నిత్యం షేర్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. తాజాగా మరో సారి అమ్మడు రెచ్చిపోయి మరి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చాలామంది వీటిని చూసి తనని గుర్తుపట్టలేకపోయామంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఎతవాలో పుట్టి పెరిగిన పియా ముంబైకి వచ్చి మోడలింగ్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2008లో తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నవీన్ చంద్రతో దళం అనే సినిమ (Pia Bajpiee) పియా బాయ్ పాయ్ లాస్ట్ మూవీ.